: ఆ ఫొటోలో షాహిద్ కపూర్ దంపతులు అదిరారు!


బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్, తన భార్య మీరా రాజ్ పుత్ తో దిగిన ఓ ఫొటో అదిరిపోయింది. నెటిజన్ల నుంచి ఎంత స్పందన వచ్చిదంటే ఈ ఫొటోను పోస్ట్ చేసిన 24 గంటల్లోనే సుమారు 12 లక్షలకు పైబడి లైక్ లు వచ్చాయి. దాదాపు పదివేలకు పైగా పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. సుమారు 6,000 మంది ఈ ఫొటోను తమ స్నేహితులతో షేర్ చేసుకున్నారు. షాహిద్ కపూర్ దంపతులు సోమవారం రాత్రి ఈ ఫొటోను దిగారు. షాహిద్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ ఫొటోను పోస్ట్ చేయడంతో అభిమానులు సంబరపడ్డారు.

  • Loading...

More Telugu News