: హైదరాబాదులో పోలీసుల తనిఖీల్లో కిలో బంగారం స్వాధీనం


ఒక వ్యక్తి నుంచి కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది. వాహన తనిఖీల్లో భాగంగా మంగళవారం లిబర్టీ కూడలి వద్ద నారాయణగూడ పోలీసులు పలు వాహనాలను ఆపారు. ఈ తనిఖీల్లో సురేశ్ అనే వ్యక్తి నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో రాంగోపాల్ పేటలో చేపట్టిన తనిఖీల్లో రూ.35 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు ఎటువంటి ధ్రువపత్రాలు లేవని, అందుకే ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News