: పాకిస్థాన్ తో ఆడకపోతే భారత్ కు వచ్చిన నష్టం ఏంటి?: జెఫ్రీ బాయ్ కాట్


పాకిస్థాన్ తో సిరీస్ ఆడకపోవడం వల్ల భారత్ వచ్చిన నష్టం ఏమీ లేదని ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత జెఫ్రీ బాయ్ కాట్ తెలిపారు. పీసీబీ, బీసీసీఐ వివాదంపై ఆయన సూటిగా స్పందించారు. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐ, పాక్ తో సిరీస్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. క్రికెట్ లో ఉన్నత స్థానంలో ఉన్న భారత్ తో ఆడేందుకు అన్ని దేశాల బోర్డులు ఉత్సాహం చూపిస్తాయని ఆయన చెప్పారు. ఇందుకు కారణం భారత్ లో ఆడిన బోర్డులు భారీగా లబ్ధి పొందుతాయని, ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఆయన తెలిపారు. భారత్ లో క్రికెట్ కు లభించే ఆదరణను దేనితోనూ పోల్చలేమని ఆయన పేర్కొన్నారు. కాగా, టీమిండియా, పాక్ సిరీస్ పై ఈ నెల 27న అధికారిక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో జెఫ్రీ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. కాగా, యూఈఏలో ఆడాలని పాక్ ప్రతిపాదించగా బీసీసీఐ ఒప్పుకోలేదు. భారత్ లో ఆడాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని పీసీబీ వ్యతిరేకించింది. దీంతో రెండు బోర్డులు సుదీర్ఘంగా చర్చించి మధ్యే మార్గంగా శ్రీలంకలో సిరీస్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాయి.

  • Loading...

More Telugu News