: రంజీల్లో అత్యంత చెత్త ప్రదర్శన


1, 5, 7, 2, 4, 0, 1, 1, 7, 0, 5... బెంగాల్ తో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో ఒడిశా ఆటగాళ్లు సాధించిన స్కోర్లు ఇవి. ఏడు వికెట్లతో వెస్ట్ బెంగాల్ స్టార్ బౌలర్ అశోక్ ధిండా, మూడు వికెట్లతో ప్రజ్ఞాన్ ఓజా రాణించడంతో ఒడిశా ఆటగాళ్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరారు. ఒడిశా ఆటగాళ్ల ప్రదర్శనకు నాలుగు రోజుల్లో ముగియాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లోనే పూర్తైంది. పేలవ ప్రదర్శనతో అత్యల్ప స్కోరు చేసి, పరాజయం పాలవుతుందని భావించిన వెస్ట్ బెంగాల్ జట్టు అద్భుతంగా పుంజుకుని విజయం సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 142 పరుగులు సాధించిన వెస్ట్ బెంగాల్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 135 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 107 పరుగులు చేసిన ఒడిశా జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 37 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.

  • Loading...

More Telugu News