: అవయవదానానికి ముందుకొచ్చిన తమిళ దర్శకులు
62 మంది కోలీవుడ్ దర్శకులు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తమ అవయవాలను పరిశోధనల నిమిత్తం దానం చేస్తున్నట్టు వారు ప్రకటించారు. తమిళ చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, కేఎస్ రవికుమార్, వాసు, ఆర్కే సెల్వమణి ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి అవయవదాన అంగీకార పత్రాలు అందజేశారు. కోలీవుడ్ దర్శకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని జయలలిత అభినందించారు. కమల హాసన్ స్పూర్తిగా తాను చేసిన ప్రతిపాదనను దర్శకులంతా సమర్థించి అంగీకరించారని విక్రమన్ తెలిపారు. మరణానంతరం శరీరాలు దానం చేయడంపై అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు.