: నా తల తెగిపడ్డా తప్పు చేయను : ముఖ్యమంత్రి కేసీఆర్
తల తెగిపడ్డా తప్పు చేయనని, తెలంగాణకు పునాది రాళ్లు వేసే బాధ్యతను ప్రజలు తనకు అప్పగించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ లో ప్రతిపక్షాలన్నింటికి వచ్చిన ఓట్లన్నీ కలిపినా మాకు వచ్చినన్ని ఓట్లు రాలేదని ఆయన విమర్శించారు. ఎవరెన్ని కూటములు పెట్టినా టీఆర్ఎస్ ను ఓడించలేరని, మహా కూటమి ఓ 'ఇంటర్నేషనల్ డోకా' అంటూ ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాల అసహన వైఖరి మంచిది కాదని, తెలంగాణలో ఏమాత్రం బలం లేని భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఊహించుకుంటోందన్నారు. కరవు మండలాల అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. కరవు మండలాలను ఆదుకునేందుకు కేంద్రాన్ని రూ.1000 కోట్లు కోరామని, త్వరలో ఢిల్లీకి మంత్రి పోచారం బృందం వెళ్లనుందని ఆయన పేర్కొన్నారు.