: చాలా చెప్పాం...అయినా రానంటున్నాడు: ఆసీస్ కోచ్


క్రికెట్ లో వన్డే కెరీర్ కు గుడ్ బై చెప్పినా, కొంత మంది టెస్టుల్లో మాత్రం కొనసాగుతారు. మరి కొంత మంది టెస్టులకు గుడ్ బై చెప్పి వన్డేల్లో కొనసాగుతారు. ఇంకొందరు వన్డేలు, టెస్టులకు గుడ్ బై చెప్పి టీట్వంటీ ఫార్మాట్ లో కొనసాగుతారు. వీరందరికీ భిన్నంగా ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ గత వారం అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలిగాడు. గాయాల బారిన పడకుండా, కెరీర్ సాఫీగా సాగుతుండగా జాన్సన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం విశేషం. దీంతో ఆసీస్ కోచ్ డారెన్ లీమన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ కలిసి జాన్సన్ ని వన్డేల్లోనైనా కొనసాగాలని కోరారు. అందుకు జాన్సన్ నో చెప్పాడు. కుటుంబంతో గడిపేందుకే తాను రిటైర్మెంట్ తీసుకున్నానని వారికి స్పష్టం చేశాడు. దీనిపై లీమన్ మాట్లాడుతూ, 'మనం ఆడాలి రా... అని పిలిస్తే... ఆడను ఇంట్లో కూర్చుని క్రికెట్ చూస్తా'నంటున్నాడని చమత్కరించాడు. జాన్సన్ తప్పుకోవడంతో ఆసీస్ పేస్ విభాగం కొంత బలహీన పడింది. మిచెల్ స్టార్క్ రాణిస్తున్నప్పటికీ సిడెల్, పాటిన్సన్, హేజిల్ వుడ్ తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News