: నమస్తే...వణక్కమ్... సింగపూర్ ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ


సింగపూర్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రవాస భారతీయుల సభలో ప్రసంగించారు. ‘నమస్తే... వణక్కమ్’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాను. కానీ, ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. ప్రస్తుతం ఇక్కడి దృశ్యాన్ని చూస్తున్న భారత్ లోని ప్రజలు ఇది సింగపూర్ అని ఎవ్వరూ అనుకోరు. ఇక్కడికి వచ్చిన ప్రతిఒక్కరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. యావత్తు ప్రపంచం నేడు భారత్ వైపు చూస్తోంది. దీనికి కారణం, మోదీ కాదు. విదేశాల్లో ఉన్న ప్రవాసభారతీయులు. మనం ఏ దేశానికి వెళ్లినా, అక్కడ ఎటువంటి పరిస్థితులున్నప్పటికీ ఆ దేశం మనదే అన్నట్లుగా ఉండాలి’ అని ప్రవాస భారతీయులకు మోదీ సూచించారు.

  • Loading...

More Telugu News