: అప్పులు చేసి సర్పంచ్ గా గెలిచింది...అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకుంది!


మన దేశంలో ఎన్నికలు జరిగే తీరుకి నిదర్శనమీ ఘటన. రాజకీయ నాయకులంతా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే ఖర్చు చేస్తామని చెబుతూ అఫిడవిట్లు సమర్పిస్తారు. తీరా ఆ లెక్కలు వాస్తవాలు కాదనే విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం అప్పులు చేసి, అవి తీర్చలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కోయిల్ కొండ మండలం బూర్గుంపల్లి గ్రామ సర్పంచ్ దేవమ్మ (60) ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారీగా ఖర్చు చేశారు. ఆమె వద్ద నగదు లేకపోవడంతో అప్పులు తీసుకుని మరీ ఖర్చు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అయితే ఆమె చేసిన అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగిపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News