: అమీర్ ఖాన్ పై విరుచుకుపడ్డ రవీనా టాండన్


ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అమీర్ సహనటి రవీనా టాండన్ ఆయనను సూటిగా విమర్శించింది. ఇలాంటివన్నీ మోదీని ప్రధానిగా చూడలేని వారంతా చేస్తున్న విమర్శలని, వారు దేశానికి సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేసింది. మత అసహనంపై విమర్శించడం తప్పులేదన్న రవీనా టాండన్, ఇలా విషం చిమ్మడం మాత్రం సరికాదని పేర్కొంది. ఈ రోజు ఒకట్రెండు సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇంతలా గొంతు చించుకుంటున్నవారు, గతంలో ముంబైపైకి మారణాయుధాలతో దాడులకు దిగినప్పుడు ఎందుకు ఖండించలేదు? వారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీసింది. అయినా దేశం నీకు ఏమిచ్చింది? నువ్వు దేశానికి ఏమిచ్చావు? అని ప్రశ్నించుకుంటే నీకు వాస్తవాలు తెలిసేవని రవీనా టాండన్ విరుచుకుపడింది.

  • Loading...

More Telugu News