: చెన్నై వరద బీభత్సాన్ని కూడా పట్టించుకోండి: జాతీయ మీడియాకు హీరో సిద్ధార్థ్ విజ్ఞప్తి
గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలతో తమిళనాడులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రాజధాని చెన్నైను వరదలు ముంచెత్తాయి. దాంతో ఏర్పడిన నష్టంతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే చెన్నై వరదలపై జాతీయ మీడియా దృష్టి పెట్టడం లేదంటూ సినీ నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ లో ఆందోళన వ్యక్తం చేశాడు. "డియర్ నేషనల్ మీడియా... హాయ్! చెన్నైతో బాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాలు వరదలతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇండియాలో ఒక భాగమే అయినప్పటికీ అమీర్ ఖాన్, షీనా బోరాల కంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకసారి మా వైపు కూడా చూడండి. మా గురించి కూడా మాట్లాడండి" అని సిద్ధూ మీడియాకు విజ్ఞప్తి చేశాడు.