: టీడీపీ పార్లమెంటరీ భేటీలో చర్చించిన అంశాలు


విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ నెల 26 న ప్రారంభమవుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన ముఖ్య అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సమావేశంలో ఎంపీలు చర్చించారు. పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం కోరాలని, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కరవు, వరదసాయంపై పార్లమెంటులో ప్రస్తావించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అటు విభజన చట్టంలోని సెక్షన్-9, 10లో ఉన్న సంస్థల ఏర్పాటుకు కేంద్ర సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ఎంపీ మల్లారెడ్డి తదితరులతో బాటు బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News