: అమీర్ ఖాన్ మత అసహన వ్యాఖ్యలను సమర్ధించిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మత అసహనంపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలికారు. ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న వాటి గురించి అందరూ అంటున్నదే అమీర్ మాట్లాడారంటూ సింఘ్వీ సమర్థించారు. ఈ మేరకు "అగ్రహీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్... బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో తన అసహనంపై గళం విప్పారు. మోదీ పాలన గురించి ప్రపంచమంతా, దేశమంతా చెప్పుకుంటున్నదే ఆయన చెప్పారు" అని సింఘ్వీ పేర్కొన్నారు. అయితే మత అసహనంపై మాట్లాడినంత మాత్రాన అమీర్ ను కాంగ్రెస్ మద్దతుదారుడిగా ముద్ర వేయడం తగదని సింఘ్వీ సూచించారు. ఆయనెలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదని, సినిమాల్లో కాకుండా నిజజీవితంలోనూ అమీర్ సందేశాత్మకంగా వ్యవహరించారని ప్రశంసించారు.