: జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం: కేటీఆర్


వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ భారీ విజయం సాధించడంతో భవిష్యత్తు ఎన్నికలపైనా మంత్రి కేటీఆర్ ధీమాగా ఉన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికతో బాటు, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లోను ఓడిపోతుంటే... తాము మాత్రం గెలుస్తున్నామని అన్నారు. ఇదే తమ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలు ఒకసారి కళ్లు తెరచి వాస్తవాలు గ్రహిస్తే మంచిదని పేర్కొన్నారు. వరంగల్ ఉపఎన్నిక విజయంపై హైదరాబాద్ లో మీడియాతో కేటీఆర్ ఈ మేరకు మాట్లాడారు. రెఫరెండం అని చెప్పి మరీ ఈ ఎన్నికలో తలపడ్డామని, తమ పనితీరుకు వరంగల్ ప్రజల తీర్పు నిదర్శనమని తెలిపారు. టీఆర్ఎస్ కు ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

  • Loading...

More Telugu News