: ఎంపీలతో చంద్రబాబు భేటీ... పార్లమెంటులో పార్టీ వైఖరిపై మంతనాలు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలతో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు తదితరులతో పాటు ఎంపీలంతా దాదాపుగా హాజరయ్యారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పార్టీ అవలంబించాల్సిన వైఖరిపై ఈ భేటీలో కీలక చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, విపక్షాల వాదనలు, మిత్రపక్షం బీజేపీ అనుసరిస్తున్న నాన్చుడు ధోరణి తదితరాలపై చంద్రబాబు ఎంపీలతో చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, ప్రత్యేెక ప్యాకేజీలను సాధించే దిశగా సభలో సభ్యులు వ్యవహరించాల్సిన విధానంపై చంద్రబాబు పలు సలహాలు, సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రధర్మం వీడకుండానే బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెచ్చే వ్యూహంపై ఈ సమావేశంలో పథక రచన జరుగుతోంది.

  • Loading...

More Telugu News