: వరంగల్ లో ప్రజా తీర్పును శిరసావహిస్తాం: రేవంత్ రెడ్డి


వరంగల్ ఉప ఎన్నికలో ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ఫలితాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని, గతంలో వైసీపీ ఉప ఎన్నికలో ఇదే ఫలితాలు సాధించిందని, సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు. అయితే తెలంగాణలో 2019 ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ కు ఎప్పటికీ తామే ప్రత్యామ్నాయమని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని, ప్రస్తుతం పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదని పేర్కొన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా ఆధిక్యంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News