: వరంగల్ ఓటర్లకు టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి కృతజ్ఞతలు
భారీ విజయం దిశగా దూసుకెళుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపించిన ఓటర్లకు, సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానని చెప్పారు. భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. బాధ్యతాయుతంగా, ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. భారీ మెజార్టీ రావడం సంతోషంగా ఉందని, తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని పసునూరి తెలియజేశారు. ఇకపై ప్రతి నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.