: మంత్రి పదవి ఇస్తానంటే, ఫలితం మారుండేది... ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి దేవయ్య
ఎన్నికలకు ముందు తాను గెలిస్తే, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని మోదీ నుంచి హామీ వచ్చి ఉంటే, నేటి ఫలితం మరోలా ఉండేదని తెలుగుదేశం, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి పగిడిపాటి దేవయ్య వ్యాఖ్యానించారు. ఓ వైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే, ఆయన తన ఓటమిని అంగీకరించారు. టీఆర్ఎస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, అందుకే ఓట్లన్నీ ఆ పార్టీకే పడ్డాయని దేవయ్య ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, పసునూరి గెలవకుంటే పింఛన్లు కట్ చేస్తామని, ఆసరా ఆపేస్తామని వారిని బెదిరించారని దేవయ్య అన్నారు.