: అమీర్... ఈ దేశం ఏమిచ్చిందో నీ భార్యకు చెప్పావా?: అనుపమ్ ఖేర్ సూటి ప్రశ్న


దేశంలో పెరుగుతున్న అసహనంపై భయపడుతున్న తన భార్య దేశాన్ని విడిచి వెళ్లాలని భావిస్తూ, ఆ విషయం తనకు చెప్పిందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యానించినప్పటి నుంచి, ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్రంగా మండిపడ్డాడు. "ప్రియమైన అమీర్ ఖాన్... ఏ దేశానికి వెళ్లాలని అనుకుంటున్నావు? అని నీ భార్య కిరణ్ ను అడిగావా? ఈ దేశమే నిన్ను 'అమీర్ ఖాన్'ను చేసిందని ఆమెకు చెప్పావా?" అని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గంటల వ్యవధిలో వేల షేర్లు, లైక్ లు వచ్చాయి. కాగా, అమీర్ వ్యాఖ్యలను పలువురు నెటిజన్లతో పాటు బీజేపీ నేతలు సైతం తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News