: గోవాలో కోహ్లీ, అనుష్క... మీడియాను చూసి ముఖాన్ని దాచుకున్న టెస్ట్ కెప్టెన్
ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా దొరికిన విరామాన్ని టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగానే వినియోగించుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి అతడు గోవా టూర్ కు వెళ్లాడు. గోవాలో సేదదీరిన తర్వాత ఆ జంట నిన్న ముంబై చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఈ జంట మీడియా కంటికి చిక్కింది. మీడియాను చూసిన కోహ్లీ, మళ్లీ దొరికిపోయామన్న ధోరణిలో తన చేతిలోని లగేజీ బ్యాగ్ తో ముఖాన్ని దాచేసుకున్నాడు. బ్యాగేజీతో ముఖాన్ని దాచుకున్న కోహ్లీ, పక్కనే అనుష్క శర్మ నవ్వుతూ నడిచి వస్తున్న సదరు ఫొటోలను అన్ని ప్రముఖ ప్రతికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి.