: ఆఫ్ఘనిస్థాన్ లో పెద్ద వ్యాపారం...తీవ్రవాదుల ఫోర్జరీ లేఖలు


ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుతం తీవ్రవాదుల ఫోర్జరీ లేఖలు పెద్ద వ్యాపారంలా తయారయ్యాయి. ఏ మూల నుంచి ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. అలాంటి దేశంలో ఉంటూ నిత్యం ప్రాణ భయంతో నరకం చూసేకంటే ఉన్న డబ్బులన్నీ చక్కబెట్టుకుని ప్రశాంతంగా ఏదో ఒక దేశం వెళ్లిపోతే బాగుంటుందని భావించే వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. వారికి అనుమతులివ్వడానికి ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఒప్పుకోదు. అదే సమయంలో ఆశ్రయం అడిగే దేశం కూడా పలు నిబంధనలు, నియమాలు అంటూ ఆశ్రయం తిరస్కరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాల్లో ఆశ్రయం పొందాలనుకునే ఉన్నత వర్గాలకు చెందిన వారు తీవ్రవాదుల నుంచి బెదిరింపు లేఖలు అందుకున్నట్టు చూపుతున్నారు. గతంలో తాలిబన్ లో ఉన్నత వర్గాల ప్రజలకు వారి తప్పుల చిట్టాను చూపించి బెదిరింపులకు దిగి నిధులు సమకూర్చుకునేది. ఆ ఉత్తరాలను వారు ప్రభుత్వానికి చూపి సురక్షితమైన సుదూర తీరాలకు వెళ్లిపోయేవారు. ఇప్పుడు అలాంటి ఫోర్జరీ ఉత్తరాలకు ఆఫ్ఘనిస్థాన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి ఉత్తరం చూపిస్తే ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో పాటు ఆశ్రయం కోరుతున్న ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుండడంతో ప్రమాదకరమైన ఆఫ్ఘనిస్థాన్ విడిచేందుకు మార్గం సుగమమవుతోంది. దీంతో ఈ లేఖను కోరుకుంటున్న ఉన్నత వర్గాలు పకడ్బందీ లేఖ తయారు చేసిన వారికి ఎంత కావాలంటే అంత ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. దీంతో ఇది పెద్ద వ్యాపారంగా మారింది. ఈ లేఖలోనే అక్కడ లక్షాధికారులుగా మారుతున్నారంటే ఈ వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News