: శ్రీనగర్ లో కదలని విమానాలు...పొగ మంచే కారణం!


శ్రీనగర్ విమానాశ్రయం నుంచి ఈరోజు వచ్చీపోయే అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ విషయాన్ని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ లో విపరీతమైన మంచు కారణంగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. మంచు కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా, పొగమంచు వల్ల రోడ్డు రవాణాకు, రైళ్లకు ఆటంకం కల్గింది. మంగళవారం నాడూ ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖాధికారులు చెప్పారు. ఇదే పరిస్థితి రేపు కూడా కొనసాగితే విమాన ప్రయాణికులకు మరింత ఇబ్బంది తప్పదని ఎయిర్ పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News