: ఆ హెలీకాప్టర్ ను కూల్చింది పక్షే!
నిన్న జమ్మూకాశ్మీర్ లో కూలిన హెలికాప్టర్ ను పక్షి కూల్చేసిందని అధికారులు వెల్లడించారు. హిమాలయన్ హెలి సర్వీసెస్ కు చెందిన హెలికాప్టర్ లో ముగ్గురు ఢిల్లీ వాసులు, ఇద్దరు జమ్మూకాశ్మీరీలు ఇద్దరు సిబ్బంది వైష్ణోదేవి దేవాలయానికి బయల్దేరారు. టేకాఫ్ తీసుకున్న కాసేపటికే పక్షి ఢీ కొట్టడంతో హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఏడుగురూ మృతి చెందారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేసిన అధికారులు సంఘటనా స్థలంలో పక్షి మృతదేహం లభ్యమైందని, పక్షి ఢీ కొట్టడం వల్లే హెలికాప్టర్ కూలిందని పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశాలిచ్చినట్టు జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మలా కుమార్ సింగ్ తెలిపారు. ఘటన వివరాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.