: ఆ ఫోటో తీసేందుకు ఆరేళ్లు పట్టింది


తన తాతకు ఇష్టమైన ఓ దృశ్యాన్ని కెమేరాలో బంధించి ఫోటో తీసేందుకు స్కాట్ లాండ్ కు చెందిన అలన్ మ్యాక్ ఫద్యేన్ (46)కు ఆరేళ్ల సమయం పట్టింది. అలన్ కిర్కుడ్ బ్రైట్ సమీపంలో ఉన్న సరస్సుకు తాత రాబర్ట్ తో కలిసి ప్రతి రోజూ వెళ్లేవాడు. అక్కడి పక్షుల కిలకిలరావాలు, నీటిలోకి అమాంతం దూకి ముక్కుతో చేపను పట్టుకెళ్లే కింగ్ ఫిషర్ విన్యాసాలు చూస్తూ అమితానందం పొందేవారు. 1994లో తన తాత రాబర్ట్ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో తాతతో తన అనుబంధం నెమరువేసుకునే అలన్ తాతకు గుర్తుగా ఆయనకు ఎంతో ఇష్టమైన కింగ్ ఫిషర్ డైవింగ్ ఫోటోను అంకితమివ్వాలని భావించాడు. బుల్లెట్ వేగంతో దూసుకువచ్చి, కన్ను మూసి తెరిచేంతలో చేపను పట్టుకుని ఎగిరిపోయే కింగ్ ఫిషర్ ను కెమెరాలో బంధించడం అంత సులభం కాలేదు. సుమారు ఆరేళ్ల పాటు 4,200 గంటలు కష్టపడి 7,900 స్నాప్స్ తీస్తే, వాటిలో తాను కోరుకున్న ఫోటో ఒక్కటి వచ్చింది. దీంతో అలన్ సంబరపడిపోయాడు. ఈ ఫోటో తన తాతకు అంకితం అంటున్నాడు. ఈ ఫోటో తాత ఉండగా తీసి ఉంటే ఆయన చూసి ఎంతో సంతోషించేవారని అలన్ పేర్కొంటున్నాడు. ఏమైతేనేం, అనుకున్నట్టు తాతకు నచ్చిన ఫోటో తీసి అలన్ మరో మధురజ్ఞాపకం గుండెల్లో పదిలం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News