: ‘సింగపూర్’లో దక్షిణ భారత రుచులు... మోదీకి వినూత్న విందు


భారత ప్రధాని నరేంద్ర మోదీకి సింగపూర్ ప్రధాని లీ వినూత్నంగా విందు ఇచ్చారు. సింగపూర్ లో ప్రఖ్యాతి గాంచిన కోమల విలాస్ లో ఈ విందు ఏర్పాటు చేశారు. 1947లో తమిళనాడు నుంచి వలస వెళ్లిన మురుగయ్య రాజు అనే వ్యక్తి ఈ కోమల విలాస్ ను ప్రారంభించారు. ఈ హోటల్ లో దక్షిణ భారత రుచులను మోదీ ఆస్వాదించారు. లిటిల్ ఇండియాలో ఉన్న ఈ రెస్టారెంట్ కు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాగా, ఈ రెస్టారెంట్ లోనే సింగపూర్ ప్రధాని లీ దంపతులతో ప్రధాని మోదీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను మోదీ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News