: విద్యార్థులకు విజయమంత్రం బోధించిన ఒడిశా సీఎం


జీవితంలో విజయం సాధించాలంటే కరేజ్, కన్విక్షన్, కమిట్ మెంట్ చాలా అవసరమని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. బీజేపీ విద్యార్థి విభాగం నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్యార్థుల సదస్సులో పాల్గొన్న ఆయన అధ్యాపకుడిగా వారికి జీవిత పాఠాలు బోధించారు. ఏదైనా ఒక అంశానికి కట్టుబడి ఉంటే నిబద్ధత, ధైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. అప్పుడు తప్పనిసరిగా జీవితంలో విజయం సాధించి తీరుతారని పట్నాయక్ చెప్పారు. విద్యార్థులు, యువత భాగస్వామ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు.

  • Loading...

More Telugu News