: వరంగల్ లో నైతిక విజయం తనదేనంటున్న వామపక్షాల అభ్యర్థి
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ఫలితం రేపు వెలువడనున్న నేపథ్యంలో గెలుపుపై వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలో నైతిక విజయం తనదేనని అన్నారు. ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం అర్థరహితమని పేర్కొన్నారు. అధికారులంతా ప్రభుత్వానికి కొమ్ముకాశారని ఆరోపించారు. 2016లో 'అంబేద్కర్ ఆర్మీ'ని ప్రారంభిస్తామని వెల్లడించారు. త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళతామని వినోద్ కుమార్ చెప్పారు.