: ప్రపంచ వైద్య రంగంలో అతిపెద్ద డీల్ ఇదే... విలువ రూ. 10 లక్షల కోట్లు!


ఈ డీల్ కుదిరితే ఫైజర్ ఐఎన్సీ ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ మేకర్ సంస్థ అవుతుంది. ఇప్పటికే చర్చలన్నీ పూర్తయిపోగా, 'బోటాక్స్'ను తయారు చేస్తున్న అలెర్గాన్ పీఎల్సీని విలీనం చేసుకోవాలని భావిస్తున్న ఫైజర్, అందుకోసం 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 లక్షల కోట్లు) చెల్లించేందుకు సిద్ధపడింది. హెల్త్ కేర్ రంగంలో ఇదే అతిపెద్ద డీల్ అని, ఇది అమెరికా ప్రభుత్వంలో రాజకీయ దుమారాన్ని రేపవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు. యూఎస్ కార్పొరేట్ పన్ను చట్టాలకు ఈ డీల్ వ్యతిరేకమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలెర్గాన్ సంస్థ ఐర్లాండ్ లో రిజిస్టర్ అయి వుండటం, ఈ డీల్ పూర్తయితే, భారీ ఎత్తున బిలియన్ల డాలర్ల అమెరికన్ కరెన్సీ ఐర్లాండ్ ఖజానాకు తరలి వెళ్లనుండటమే యూఎస్ ఆర్థిక నిపుణులను కలవరపెడుతోంది. ఈ డీల్ కుదిరితే, ఒక్కో అలెర్గాన్ ఈక్విటీ వాటాకు 11.3 ఫైజర్ వాటాలు వెళ్తాయి. మొత్తం డీల్ లో 10 శాతం కన్నా కాస్తంత తక్కువగా నగదు రూపంలోనే ఫైజర్ చెల్లించాల్సి వుంటుంది. ఆ మొత్తమే దాదాపు 15 బిలియన్ డాలర్లు ఉంటుంది. కొత్తగా ఏర్పడే సంస్థకు ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయాన్ రీడ్ సీఈఓగా వ్యవహరిస్తారు. అలెర్గాన్ సీఈఓ బ్రెంట్ సౌండర్స్ కొత్త కంపెనీ వైస్ సీనియర్ గా బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News