: అసలోడు దొరక్కపోయినా, 16 మందిని అరెస్ట్ చేశారు!


పారిస్ సహా పలు చోట్ల ఐఎస్ఐఎస్ ఉగ్రదాడులు జరుపుతున్న నేపథ్యంలో బ్రసెల్స్ లో హై అలర్ట్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో భద్రతా దళాలు, సైన్యం, పోలీసులు కలిపి జరిపిన సోదాల్లో ఇప్పటివరకూ 16 మందిని అదుపులోకి తీసుకున్నామని, అయితే, అందులో పలు ప్రాంతాల్లో దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సలాహ్ ను అదుపులోకి తీసుకోలేకపోయామని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 19 దాడులు జరిపామని, చార్లెరోయ్, ఎరిక్ వాన్ డర్ సిప్ట్ ప్రాంతాలతో పాటు సెంట్రల్ బ్రసెల్స్ ఏరియాలో దాడులు జరుపగా, అరెస్టయిన వారిలో ప్రధాన సూత్రధారి లేడని ఫెడరల్ ప్రాసిక్యూటర్ అధికార కార్యాలయం ప్రతినిధి ఒకరు వివరించారు. అనుమానితుల వద్ద కూడా ఏ విధమైన ఆయుధాలు లేవని ఆయన అన్నారు. కాగా, బ్రసెల్స్ భద్రతా దళాలు వెతుకుతున్న సలాహ్, ఫ్రాన్స్ లో దాడుల అనంతరం పోలీసుల సోదాల అనంతరం మరణించిన అబ్దేస్లామ్ ఒకరేనని భావిస్తున్నారు. గత రాత్రి ఓ స్నాక్ బార్ లో పోలీసులు రైడింగ్ చేయగా, కాల్పుల శబ్దాలు వెలువడ్డాయి. ఆపై పోలీసులు పలు ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించి అనుమానం వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News