: రైల్వేట్రాక్ లపై వరదనీరు!...పలు రైళ్లు రద్దు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ లపై వరద నీరు చేరింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. కడప జిల్లా రాజంపేట- పుల్లంపేట, నందలూరు-మంటపంపల్లె మధ్య రైల్వే ట్రాక్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈరోజు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వాటి వివరాలు... కరైకల్-లోకమాన్యతిలక్, చెన్నై సెంట్రల్-సీఎస్టీ ముంబయి, చెన్నైఎగ్మోర్- కాచిగూడ, లోకమాన్యతిలక్- చెన్నైసెంట్రల్, సీఎస్టీ ముంబయి- చెన్నై సెంట్రల్, సీఎస్టీ ముంబయి-కన్యాకుమారి, కాచిగూడ- చెన్నైఎగ్మోర్, కాచిగూడ-చిత్తూరు, చిత్తూరు-కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా రేపటి కన్యాకుమారి-సీఎస్టీ ముంబయి ఎక్స్ ప్రెస్ కూడా రద్దయినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News