: వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి: కలెక్టర్ కరుణ


వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు రేపు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎనుమాముల మార్కెట్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం 7 హాళ్లు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించినట్లు కలెక్టర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News