: గొలుసు దొంగలపై జరిపిన కాల్పులపై పిటిషన్... పిటిషన్ దారుకు తలంటిన హైకోర్టు
హైదరాబాద్ లో ఇటీవల వనస్థలిపురంలో ఇద్దరు దొంగలపై కాల్పులు జరిపిన ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా, దొంగలైనంత మాత్రాన కాల్పులు జరపాలా? ప్రజల భద్రతను పట్టించుకోరా? అని పిటిషన్ వేసిన న్యాయవాది తన వాదనను తెలిపాడు. దాంతో మండిపడిన న్యాయమూర్తి, 'ఏం దొంగలకు మద్దతు పలుకుతున్నావా? గొలుసు దొంగలపై సానుభూతి చూపాలా?' అని నిలదీశారు. వెంటనే పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఇలాంటి పిటిషన్లు మళ్లీ వేయకూడదని మందలించారు.