: కుప్వారాలో ఎన్ కౌంటర్... ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం


పాకిస్థాన్ భూభాగంగా భారత్ లో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తున్న ఉగ్రమూకల ఆగడాలు నానాటికీ మితిమీరుతున్నాయి. ఓ పక్క ఉగ్రవాదుల చొరబాట్లను భారత సైన్యం తిప్పికొడుతున్నా, చొరబాటు యత్నాలు మాత్రం ఆగడం లేదు. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా పరిధిలో సరిహద్దు వద్ద భారత భూభాగంలోకి చొరబడేందుకు నేటి ఉదయం ఉగ్రవాదుల మూక యత్నించింది. అయితే వారి కదలికలను పసిగట్టిన భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) ఉగ్రవాదులపై కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా మిగలిన ఉగ్రవాదులు పలాయనం చిత్తగించారు. వారి కోసం బీఎస్ఎఫ్ బలగాలు ముమ్మరంగా సోదాలు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News