: మోదీ నోట తమిళ మాట!...మలేసియాలో తమిళులను ఆకట్టుకున్న భారత ప్రధాని


విదేశీ పర్యటనల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రసంగించిన మోదీ అక్కడి ఎన్నారైలతో కేరింతలు కొట్టించారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ వేదికగా జరిగిన మోదీ బహిరంగ సభ భారత్ అనుకూల నినాదాలతో హోరెత్తింది. నిన్నటికి నిన్న బ్రిటన్ పర్యటనలో భాగంగా మోదీ ప్రభావం ఏకంగా ఆ దేశ ప్రధాని కామెరూన్ సతీమణి చేత చీర కట్టుకునేలా చేసింది. తాజాగా ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సుకు వెళ్లిన సందర్భంగా మోదీ నిన్న మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. మలేసియాలో ఉన్న ప్రవాస భారతీయుల్లో మెజారిటీ తమిళులదే. మెజారిటీ అనే కంటే అక్కడ ఉన్న ప్రవాస భారతీయులంతా దాదాపుగా తమిళులే. ఈ విషయంపై అవగాహన ఉన్న నరేంద్ర మోదీ 'వణక్కం' (నమస్కారం) అంటూ తమిళంలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. మళ్లీ ప్రసంగం చివర్లో కూడా 'వణక్కం' అంటూనే ముగించారు. మోదీ నోట ఇలా తమిళ మాట వినపడటంతో అక్కడి తమిళులు కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News