: విద్యుత్ అధికారుల నిర్వాకం... రూ. 39 కోట్ల బిల్లు
విద్యుత్ శాఖ నిర్వాకాలతో సామాన్యుల గుండెలు గుభేల్ మంటున్నాయి. జమ్మూలోని పురాణ్ నగర్ లో నివసించే రామ్ కృష్ణన్ కు ఇదే జరిగింది. అక్టోబర్ నెల విద్యుత్ బిల్లును చూసిన ఆయనకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. రూ. 39 కోట్ల కరెంట్ బిల్లు చూసిన రామ్ కు కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే తేరుకుని, సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి పరుగులు పెట్టాడు. అక్కడున్న అధికారులతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే, సాఫ్ట్ వేర్ లో ఏదో సమస్య తలెత్తిందని, సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు సమాధానమిచ్చారు. జమ్మూలోని పవర్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ నిర్వాకమిది. ఇలాంటి ఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నోసార్లు జరిగాయి.