: మేయర్ దంపతుల హత్య కేసులో చింటూ అనుచరుడి ఇంట్లో తనిఖీలు
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ రాయల్ అనుచరుల ఇళ్లలో పోలీసుల సోదాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. సంతపేటలో మహిళా కార్పోరేటర్ భర్త మురుగ ఇంట్లో పోలీసుల తనిఖీలు జరుపుతున్నారు.