: చూడండి ఏం చేస్తామో... అంటూ తమ విధ్వంసాన్ని గ్రాఫిక్స్ రూపంలో చూపిన ఐఎస్ఐఎస్


దాదాపు 10 రోజుల క్రితం పారిస్ లో జరిపిన ఉగ్రదాడి చాలా చిన్నదని, అంతకుమించిన భయంకర దాడులు జరుపుతామని చెబుతూ, ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఓ తాజా గ్రాఫిక్స్ వీడియోను విడుదల చేసింది. "జీఐ జో: ది రైజ్ ఆఫ్ కోబ్రా" చిత్రం నుంచి కాపీ కొట్టి, ఈఫిల్ టవర్ ను ఓ రాకెట్ కూలగొట్టే సన్నివేశాన్ని చూపింది. దాదాపు ఆరేళ్ల నాడు విడుదలైన చిత్రంలోని సన్నివేశానికి, మరికొన్ని చిత్రాలు, ఉగ్రవాదుల హెచ్చరికలను జోడిస్తూ, ఆరు నిమిషాల నిడివి వున్న వీడియోను విడుదల చేసింది. "పారిస్ కుప్పకూలింది" అన్న టైటిల్ తో దీన్ని బయటకు పంపుతూ, తాము ఈ దృశ్యాన్ని నిజం చేసి చూపుతామని, సినిమాలో చూసిన దానికన్నా వాస్తవ పరిస్థితి మరింత భయాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. సెప్టెంబర్ 11 దాడుల కన్నా తాము జరిపే విధ్వంసం అధికమని తెలిపింది.

  • Loading...

More Telugu News