: మాటలు చెప్పే రకం కాదు... ఆయన చేతల మనిషి: మోదీపై మలేషియా ప్రధాని పొగడ్తలు


భారత ప్రధాని నరేంద్ర మోదీ మాటలతో మాయపుచ్చే రకం కాదని, ఆయన చేతల మనిషని, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పొగడ్తల వర్షం కురిపించారు. మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ఆయన, భారత్ తో తమ దేశపు వాణిజ్యం మరింతగా పెరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్యా కొనసాగుతున్న స్నేహ సంబంధాలు సంతృప్తికరంగా ఉన్నాయని, భద్రత, రక్షణ రంగాల్లో మరింత సహాయ సహకారాలను ఇచ్చి పుచ్చుకునేందుకు తాము సిద్ధమని రజాక్ వెల్లడించారు. అంతకుముందు కౌలాలంపూర్ శివార్లలోని రాజధాని నగరం పుత్రజయ వద్ద మోదీకి స్వాగతం పలికేందుకు స్వయంగా కారు దిగి వచ్చిన రజాక్, మోదీని ఆలింగనం చేసుకున్నారు. సంప్రదాయ సైనిక స్వాగతం అనంతరం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

  • Loading...

More Telugu News