: మలేషియా జలపాతంలో పడి తమిళ యువ హీరో దుర్మరణం
త్వరలో విడుదలకు సిద్ధమైన తమిళ చిత్రం 'క్కాక్కాకా'లో హీరోగా నటిస్తున్న యువ నటుడు కేశవన్ మలేషియాలో మరణించాడు. నూతన దర్శకుడు విజయ్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. కాగా, ఈ చిత్రం ప్రమోషన్ కోసం మలేషియాలో టీవీ చానల్స్ కు ప్రత్యేక కార్యక్రమం చేయడానికి తన కుటుంబ సభ్యులతో కలసి మలేషియా వెళ్లిన కేశవన్, అక్కడి జలపాతాలు చూస్తున్న క్రమంలో కాలుజారి అందులో పడిపోయాడు. ఆ సమయంలో కేశవన్ తల్లి సైతం అక్కడే ఉంది. కళ్లముందే కొడుకు జలపాతంలో కొట్టుకుపోవడంతో ఆమె రోదన ప్రతి ఒక్కరినీ కదిలించింది. తమ చిత్రం ఆడియో విడుదల వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న వేళ, హీరో ప్రమాదవశాత్తూ మరణించడం ఎంతో బాధను కలిగిస్తోందని విజయ్ అన్నాడు.