: మోకాళ్లపై మోత్కుపల్లి!... కేసీఆర్ మనసు మార్చాలని యాదగిరీశుడికి పూజలు
టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నిన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అరుదైన ఫీట్ చేశారు. ఆలయ ప్రాంగణంలో మోకాళ్లపై కూర్చున్న ఆయన యాదగిరీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ మొక్కు కూడా మొక్కుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మనసు మార్చాలని ఆయన స్వామివారిని కోరారు. యాదగిరిగుట్ట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసేలా కేసీఆర్ కు బుద్ధి ప్రసాదించాలని మోత్కుపల్లి స్వామివారిని వేడుకున్నారు. మోత్కుపల్లి మోకాళ్లపై కూర్చున్నారంటే నేరుగా నేలపై మాత్రం కూర్చోలేదులెండి. నేలపై తెలుపు రంగులో ఉన్న ఓ మెత్తటి వస్త్రాన్ని పరిచి దానిపై మోత్కుపల్లి మోకాళ్లపై కూర్చుని తన కోరికను యాదగిరీశుడి ముందు పెట్టారు.