: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది... జేసీ సంచలన వ్యాఖ్య
సొంత పార్టీ ప్రభుత్వంపై నిరసన గళం విప్పుతున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు తన నోటికి పని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పాటు ఏపీలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఆయన నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రభుత్వాలు తమ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో నిన్న జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేసీ, రాష్ట్రంలో స్తబ్ధత నెలకొన్న ఈ కారణంగా ప్రజలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. రానున్న ఏడాదిలో ప్రభుత్వ పరిపాలనలో మార్పు రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విజయవాడలోను... అధికార యంత్రాంగం హైదరాబాదులోను ఉండటం వల్లే పాలన గాడి తప్పుతోందని ఆయన వ్యాఖ్యానించారు.