: పాక్, అఫ్ఘాన్ లో పెను భూకంపం... ఢిల్లీ, కాశ్మీర్ లోనూ కంపించిన భూమి


భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ తో పాటు అఫ్ఘనిస్థాన్ లో నిన్న రాత్రి పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 గా నమోదైంది. దీనికి సంబంధించిన భూకంప కేంద్రం హిందూకుష్ లో ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం కారణంగా ఆ రెండు దేశాల్లో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ఇదిలా ఉంటే, ఈ భూకంపం తీవ్రత కారణంగా భారత్ లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పాక్ సరిహద్దు ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

  • Loading...

More Telugu News