: ఎక్కువ మొక్కలు నాటి ‘గిన్నిస్’కెక్కిన రాష్ట్రం!


ఉత్తరప్రదేశ్ లో పచ్చదనం- పరిశుభ్రత కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలు బాగా స్పందించారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను నాటారు. దీంతో ఆ రాష్ట్ర ఖ్యాతి గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8 గంటల్లో 10 లక్షలు మొక్కలు నాటారు. ఈ నెల 7న ఉదయం 8.30 నుంచి 4.30 గంటల్లోపు 10.15 మొక్కలు నాటినట్లు ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. మొక్కలు నాటే కార్యక్రమంలో అటవీ, నీటిపారుదల శాఖల సహకారంతో అన్నివర్గాలు వారు పాల్గొన్నారు. దీంతో ఈ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా సాయ్ ఫాయ్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం అఖిలేష్ యాదవ్ కు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అఖిలేష్ తెలిపారు. ఇందుకు సంబంధించి ‘గిన్నిస్’ అధికారుల నుంచి సర్టిఫికెట్ ను తీసుకుంటున్న ఒక ఫొటోను కూడా ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News