: వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి దారుణం: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ రహదారుల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. వరదలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ పరిస్థితిని ప్రధాన మంత్రి కార్యాలయానికి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వివరించానని చెప్పారు. వరదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. కేంద్ర బృందం పర్యటన తర్వాత ఏపీకి మరింత సాయం అందుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News