: వరద బాధితుల రేషన్ లో మోసాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు: చంద్రబాబు
నెల్లూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నాయుడు పేట మండలంలోని పండ్లూరులో మామిడికాలువను పరిశీలించారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వరద సాయం గురించి అధికారులను బాధితులు నిలదీయాలని అన్నారు. వరద సాయంలో భాగంగా అందించే నిత్యావసరాల విషయంలో రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వరద బాధితులను ఆదుకోని అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని బాబు అన్నారు.