: ఐఎస్ ను ధ్వంసం చేస్తాం : అమెరికా అధ్యక్షుడు ఒబామా
యుద్ధరంగంలో తమను ఎదుర్కొనే సత్తా ఇస్లామిక్ స్టేట్ కు లేదని, అందుకే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఆదివారం కౌలాలంపూర్లో జరుగుతున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తాము ఇస్లామిక్ స్టేట్ ను ధ్వంసం చేస్తామని, ఆ క్రమంలో దానికి ఎక్కడి నుంచీ నిధులు అందకుండా అడ్డుకట్ట వేస్తామని అన్నారు. తమకు ప్రపంచ ప్రజల ప్రాణాలు ముఖ్యమని, మతపరంగా తమకు ఎలాంటి వివక్ష లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా దాడులకు దిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ దాడులు ఇస్లామిక్ స్టేట్ ను అంతమొందించే లక్ష్యంతో చేసినట్లుగా కాకుండా కేవలం తన ప్రత్యర్థిపై దాడులు చేసినట్లుగా ఉన్నాయని ఒబామా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.