: మావోయిస్టు బక్కన్న అరెస్టు


నిన్న అర్ధరాత్రి తర్వాత జన్నారం అటవీ ప్రాంతంలో మావోయిస్టు సభ్యుడు చెంచుల బక్కన్న పట్టుబడ్డాడని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ సందర్భంగా బక్కన్నను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ, 'ఈ నెల 18న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడ్డ బక్కన్న తప్పించుకుని పారిపోయాడు. అయితే, అతని కోసం గాలిస్తుండగా నిన్న అర్ధరాత్రి తర్వాత జన్నారం అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు' అని చెప్పారు. గత అక్టోబర్ 30న ఇన్ఫార్మర్ నెపంతో బలాల్షా అనే గిరిజనుడిని కాల్చి చంపింది బక్కన్నే అని అన్నారు. అతని నుంచి 9 ఎంఎం పిస్తోలు, 3 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.

  • Loading...

More Telugu News