: వివేకానందుడు ఏ ఒక్కరికో పరిమితమైన ప్రతినిధి కాదు: ప్రధాని మోదీ
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు స్వామి వివేకానందుడు ప్రతిరూపమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కౌలాలంపూర్ లో వివేకానందుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, వివేకానందుడు ఏ ఒక్కరికో పరిమితమైన ప్రతినిధి కాదన్నారు. పశ్చిమ ప్రాంతాల పర్యటనకు సాహసించిన స్వామి వివేకానంద శాంతి, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారన్నారు. ఆసియా ఖండమంతా ఒక్కటిగా ఉండాలని ఆనాడే చెప్పిన మహానుభావుడు వివేకానందుడు, మానవసేవే మాధవ సేవని ప్రవచించారన్నారు. ఈ సందర్భంగా యోగ, గ్లోబల్ వార్మింగ్ మొదలైన అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా యోగ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ఆరోగ్యకరమైన, ఒత్తిడి లేని జీవనం గడిపేందుకు యోగ చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడేందుకు మానవాళి కృషి చేయాలన్నారు.