: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ: నలుగురు దుర్మరణం
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా పదిమంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు...గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి కారంపూడి వెళ్తున్న ఆర్టీసీ బస్సును జానపాడు మండలం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. మరో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. కాగా, క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.