: ‘చిత్తూరు’కు జలకళ... ‘కడప’లో అన్ని జలాశయాలు నిండాయి: సీఎం చంద్రబాబు


తక్కువ నీటితో పంటలు సాగయ్యే ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులో సోమశిల జలాశయం వద్ద జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో జలవనరుల పరిస్థితి, వినియోగంపై నీరు-ప్రగతి పేరుతో త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. సోమశిల జలాశయంలో ప్రస్తుతం 54.5 టీఎంసీల నీరు ఉందని, నెల్లూరు జిల్లాలో ఈ సారి 16 లక్షల ఎకరాల్లో పంట సాగుకు ప్రణాళికలు చేస్తున్నట్లు బాబు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో కూడా జలకళ వచ్చిందన్నారు. 20 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి వర్షాల కారణంగా ఈ జిల్లాకు జలకళ వచ్చిందన్నారు. కడప జిల్లాలోని అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయన్నారు. సోమశిల జలాశయాన్ని పర్యాటక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనుకూలంగా ఉందన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు సోమశిల, పెంచలకోన, మైపాడు బీచ్, కండలేరు ప్రాంతాలను అనుసంధానిస్తామన్నారు. అధికార యంత్రాంగాన్ని కాంగ్రెస్ పాలకులు నిర్వీర్యం చేశారని, తద్వారా వరద బాధితులకు సాయమందించే ప్రక్రియ ఆలస్యమవుతోందని బాబు ఆరోపించారు.

  • Loading...

More Telugu News